పఠాన్ సక్సెస్ తర్వాత క్లౌడ్ నైన్‌లో ఉన్నారు షారుఖ్ ఖాన్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనులు కంప్లీట్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం జవాన్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా జవాన్. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ చేస్తున్నారు. దీపిక పదుకోన్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్టు వినికిడి. సౌత్ నుంచి ఓ స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని కూడా మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా జవాన్‌కి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రస్తుతం ముంబైలో సాంగ్ షూట్ జరుగుతోంది. ఫరాఖాన్ నేతృత్వంలో పాట చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం.
ముంబైలోని బీచ్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసుకున్నారు ఫరా. సేమ్ అదే డ్రస్‌లో షారుఖ్ లొకేషన్లో ఉన్న పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి షారుఖ్ పాటకు ఫరా స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు షారుఖ్ ఫ్యాన్స్. సునీల్ గ్రోవర్, సాన్యా మల్హోత్రా ఈ సినిమాల కీ రోల్స్ చేస్తున్నారు. సౌత్ ఫ్లేవర్స్ అధికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. జవాన్‌తో పాటు మరో సినిమా డంకీలో నటిస్తున్నారు షారుఖ్ ఖాన్. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్‌మస్‌కి విడుదల చేయనున్నారు డంకీ మూవీని.